Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తండ్రికొడుకుల బలవన్మరణం

Body-On-Railway-Track

ఖమ్మం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని చర్చి కాంపౌండ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో రైల్వే పట్టాలపై మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతులను కల్లూరుకు చెందిన కాశీవిశ్వనాథ్ ఆయన ఇద్దరు కుమారులు జయంత్(13), అజయ్(12)లుగా గుర్తించారు. కాగా, కాశీవిశ్వనాథ్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Three Family Member Commits Suicide in Khammam.

Comments

comments