Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

శ్రవణానందకారకుడు త్యాగయ్య

TYAGARAJU

రామేతి మధుర భక్తిభావనలో 96 కోట్ల పర్యాయాలు రామనామాన్ని జపించి స్వీయానుభావాలే కృతులుగామలిచి గాంధర్వగాన మధురానుభూతులను లోకానికి అందించిన త్యాగరాజస్వామి సుప్రసిద్ధ సంగీతవిద్వాంసుడు.స్వరార్ణవం నారదీయం అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలను రచించిన ధన్యుడు. త్యాగరాజస్వామికీర్తనలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి రామభక్తామృతాన్ని సేవించి,కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధురకీర్తనలుగా మలిచి సంగీత,సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

సంగీత సాగరాన్ని మదించి కర్ణాటకసంగీతంలో శాశ్వతకీర్తిని అర్జించిన త్యాగరాజుకీర్తనలు ఎల్లవేళల ప్రజలను భక్తిమార్గంలోకి పయనింపచేస్తూనే ఉన్నాయి. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి కర్ణాటక సంగీత నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతకీర్తిని సముపార్జించిన త్యాగరాజు సంగీత సామ్రాజ్యంలో రారాజు. కర్ణాటక సంగీతానికి మూలస్తంభమైన త్యాగరాజు కంభం మండలం కాకర్లలో సీతమ్మదంపతుల మూడవసంతానం. 1847 జనవరి 6న ఆయన భౌతికంగా దూరమైన ఆయనకృతులు సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతూనే ఉన్నాయి. త్యాగరాజు జన్మ నామం కాకర్ల త్యాగబ్రహ్మం. త్రిలింగవైదికులైన ఆయన పూర్వకులు తమిళదేశానికి వలసవెళ్ళారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శంభోజి దగ్గర విధులు నిర్వహించారు. తాత గిరిరాజ కవి. ఒకసందర్భంలో త్యాగయ్య బంగాళ రాగంలో గిరిరాజసుతా తనయ అంటూ తాతను స్తుతించిన సందర్భం ఉంది.నాదోపాసన తో భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్పవాగ్గేయకారుడు.

ఆయన కీర్తనలు శ్రీరామచంద్రునిపై ఉన్న విశేషభక్తిని ప్రదర్శిస్తాయి. భక్తిని,వేదాలను,ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియచేస్తాయి.ఉపనయనం అనంతరం తండ్రి బోధనలు,18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశించిన రామ షడాక్షరీ మంత్రప్రభావం,తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజస్వామిని మూర్తీభవింపచేశాయి. త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటయ్య దగ్గరపిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేళ్ళ చిరుప్రాయంలో త్యాగరాజు నమో నమో రాఘవా కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపర్చిన విద్వాంసుడు. గురువు దగ్గర చేసిన కచేరిలో ఎందరో మహానుభావులు కీర్తనను స్వరపర్చి పాడిన కీర్తన నేటికి సంగీతవిద్వాంసుల మన్నలను పొందుతూనేఉంది.

త్యాగరాజును బాలమేధావిగా తంజావూరు ప్రజలమన్నలను పొందారు. తంజావూరు రాజు త్యాగరాజకృతులకు పరమానందభరితుడై ధనకనక వస్తూ వాహనాధిరాజలాంచనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. అయితే కానుకలకంటే రామసన్నిధిలోనే ఆత్మానందం ఉందని కానుకలను నిర్దంద్వంగా తిరస్కరించిన రామభక్తుడు ఆయన.ఈ సందర్భంగా స్వరపరిచి పాడిన నిధి చాలాసుఖమా కీర్తన సంగీతంతో భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించారు. అయితే తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినందుకు త్యాగయ్య నిత్యం ఆరాధించే శ్రీరామ పట్టాభి షేక విగ్రహాలను కావేరి నదిలో అన్న జపేశుడు విసిరివేడం తట్ట్టుకోలేక దక్షిణభారత యాత్రకు వెళ్ళి అనేక దేవాలయాలను,తీర్థాలను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలు రచించారు.

త్యాగరాజు సుమారు 800ల కీర్తనలు రచించారు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాషలో రచించినవే.కొన్ని సంస్కృతంలో రచించినవి ఉన్నాయి. త్యాగరాజు స్వరపర్చిన జగదాందకారక కీర్తన శ్రీరామునికి ఉన్న108 పేర్లను ప్రస్తావిస్తుంది. ప్రహ్లాద భక్తివిజయం,నౌకాచరితం సంగీత నాట్యరూపకాలను రచించారు. త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్ట మైన అనేక అంశాలు ఉన్నాయి.త్యాగయ్య 24000 రచనలు రచించినట్లు పరిశోధకులు చెపుతుంటారు. దివ్యనామసంకీర్తనలు,ఉత్సవసంప్రదాయకీర్తనలు,బృందకీర్తనలు అనేకం ఉన్నాయి.త్యాగరాజస్వామి రచించిన పంచకృతుల్లో ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం,నిత్యానుష్టానాలు ఉన్నాయి. సంగీత కళాకారులు తొలుత ఊంఛవృత్తి భజన,అనంతరం నివాసస్థలమైన తిరుమంజనవీది నుంచి బయలుదేరి సమాధివరకు కీర్తనలు గానం చేస్తారు. వందలాధి సంగీతకళాకారులు త్యాగయ్య రచించిన పంచకృతులను కావేరీ నదీ ఒడ్డున గల సమాధివద్ద బృందగానం చేస్తారు.అలాగే తిరువయ్యూరు లో నిర్వహించే ఆరాధన సుప్రసిద్ధి.

త్యాగరాజ సమాధిని మహాభక్తురాలు నాగరత్నమ్మ నిర్మించారు.1921 లో రాజుల దగ్గరనుంచి స్థలసేకరణ చేసి 1925 లో సమాధి నిర్మించి భక్తులకు అందించారు. సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి భౌతికంగా మనలో లేకపోయినా ఆయన కీర్తనలు భక్తిభావాల సుగంధాలను వెదజల్లుతూ శ్రవణానందాన్ని కలిగిస్తూనే ఉన్నాయి.

తిరువత్తియూరు పంచరత్నములు * సుందరి నన్ను* సుందరి నీ దివ్య* సుందరి నిన్ను వర్ణింప* కన్నతల్లి నిన్ను సావేరి* దారిని తెలుసుకొంటి
శుద్ధ సావేరి

కొవ్వూరు పంచరత్నములు   * నమ్మివచ్చి న * కోరి సేవింప* శంభోమహదేవ* ఈ వసుధశహాన* సుందరేశ్వరుని

ఘనరాగ పంచ పంచరత్నములు* జగదానంద * దుడుకులగల * సాధించినే* ఎందరో శ్రీ* కనకరుచిరా

Comments

comments