Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రానున్న కాలంలో తెలంగాణలో టిడిపే ప్రత్యామ్నాయం

talk

మన తెలంగాణ/నర్సంపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం లో రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయం కాగలదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం నల్లబెల్లి, ఖానాపురం మండలాల టిడిపి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు, కవితలే అధికారం చెలాయిస్తున్నారని ఆయన అన్నారు. మూడున్నర ఏళ్లు గా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిపనులు చేయకపోవడంతో ప్రజలకు దూరం అయిపోయిందని అన్నారు. టిడిపి అదికారంలో ఉన్న 9 ఏండ్ల కాలంలో నర్సంపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నాడు అభివృద్ది చేసిన పనులకు నిదులు కేటాయించే దుస్థితిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విదానాలను అనుసరిస్తుందని వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజవర్గ శాసనసభ్యుడు దొంతి మాదవరెడ్డి , రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి లు కుమ్మక్కై కాంట్రాక్టుల బిల్లులలో పర్సంటేజిలు పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దొంతి మాదవరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు తమ స్వంత ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కృషిచేయడం లేదన్నారు. అభివృద్దే ద్యేయంగా పనిచేసే తెలుగుదేశం పార్టిని ప్రజల అండదండలు ఎప్పటికి ఉంటాయని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టి విజయం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈసమావేశంలో నల్లబెల్లి మండల టిడిపి అద్యక్షుడు మామిండ్ల మోహన్‌రెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షుడు సంతోష్‌నాయక్, వేణు, సత్యనారాయణ, చంద్రమౌళి  పాల్గొన్నారు.

Comments

comments