Search
Friday 20 April 2018
  • :
  • :

సమస్యల పరిష్కారానికి పెద్దపీట

yekkow

*పదిన్నర కోట్లతో అభివృద్ధ్ది పనులు..హాజరుకానున్న మంత్రి హారీశ్‌రావు
*ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి

మనతెలంగాణ/రామచంద్రాపురం : ప్రజల సమస్యల పరిష్కారానికే పెద్ద పీట వేస్తున్నట్లు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రి హరీశ్‌రావు పర్యటనకు సంబంధించి గురువారం భారతినగర్ డివిజన్ ఎల్‌ఐజి కాలనీలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సిందు ఆదర్శరెడ్డిలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధ్ది పరిచేలా కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే కేవలం భారతినగర్ డివిజన్‌లో దాదాపు పదిన్నర కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధ్ది పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. శనివారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎమ్‌ఐజి ఫేస్-1లో దాదాపు ఏడు కోట్ల రూపాయలు, పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ ఎమ్‌ఐజి, ఎల్‌ఐజి, అన్నమయ్య ఎంక్లేవ్, విద్యుత్‌నగర్, మాక్స్ సొసైటీ, ముంబాయి కాలనీ, ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాల్లో దాదాపు ముడున్నర కోట్ల రూపాయలతో పలు అభివృద్ధ్ది పనులు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, నాయకులు ఆదర్శరెడ్డి, కుమార్‌గౌడ్, పరమేష్ యాదవ్, నవీన్, శివయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments