Search
Sunday 21 January 2018
  • :
  • :

నేడే కిక్ బాక్సింగ్ ఫైనల్ పోటీలు

kik

బాలికల విభాగంలో 7 స్థానాల్లో మహారాష్ట్ర, 3 స్థానాల్లో తెలంగాణ
మెదక్ టౌన్ : పట్టణంలో నిర్వహిస్తున్న 63వ జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో బుధవారము నాడు నిర్వహించిన పోటీలలో నెగ్గి వివిధ రాష్ట్రాల నుండి 18 మంది బాలికలు ఫైనల్‌కు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారము నాడు నిర్వహించనున్న 24 కేజీల విభాగంలో మహారాష్ట్ర – ఢిల్లీ, 28 కేజీల విభాగంలో తెలంగాణ – మహారాష్ట్ర, 32 కేజీల విభాగంలో మహారాష్ట్ర జమ్ముకాశ్మీర్, 37 కేజీల విభాగంలో ఢిల్లీ – మహారాష్ట్ర, 42 కేజీల విభాగంలో మహారాష్ట్ర, తెలంగాణ, 46 కేజీల విభాగంలో ఛత్తీస్‌ఘడ్ – మహారాష్ట్ర, 50 కేజీల విభాగంలో మహారాష్ట్ర – పంజాబ్, 50 కంటే ఎక్కవ కేజీల విభాగంలో పంజాబ్ – తెలంగాణలు పోటీపడనున్నట్లు తెలియజేశారు. దాదాపు ఏడు విభాగాలలో మహారాష్ట్ర క్రీడాకారులు ఫైనల్‌కు చేరగా మూడు విభాగాలలో తెలంగాణ ఫైనల్‌లో తలబడనున్నాయి. ఈ క్రీడలను బుధవారము నాడు మాజీ శాసనసభ్యులు పట్లోళ్ళ శశిధర్‌రెడ్డి తిలకించి క్రీడాకారులను అభినందించారు. ఈ క్రీడాపోటీలు ఎస్‌జిఎఫ్ మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యం. సింహాచలం, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రావు, మాధవరెడ్డిలు, పలువరు పీఇటీల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. గురువారము నుండి బాలుర విభాగంలో పోటీలు ప్రారంభం కానున్నట్లు వివరించారు.

Comments

comments