Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రేపు ఐటి హబ్‌కు ముహూర్తం

talk

*వేయ్యి మంది యువతకు ఉద్యోగావకాశాలు
*త్వరలో కంపెనీల కోసం అమెరికాకు పయనం
*మంత్రి కెటిఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన
*అధికారులతో ప్రతినిధులతో సమావేశం
*గత ప్రభుత్వాలు మోసం చేశాయి
*కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల ను మోసం చేశాయని కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్కు సమీపంలో నిర్మిం చే ఐటి హబ్, నగరంలోని వన్‌టౌన్ ఎదుట 250కోట్ల నిధులతో నగరంలో చేపట్టే వివిధ పైలాన్ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కరీంనగర్‌కు రాష్ట్రంలోనే అధిక నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్‌కు కరీంనగర్ అభివృద్ధిపై ఎంతో ప్రేమ ఉందన్నారు. అందులోని భాగంగానే అధిక నిధులను అందరి సహకారంతో తీసుకువచ్చి నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఇటీవలే 149 కోట్లతో తీగల బిడ్జ్‌క్రు మంత్రులు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు ఐటి హబ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అక్కడి నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఐటి పార్కు విషయంలో గత ప్రభుత్వం మాయ మాటాలు చెప్పి విద్యార్థులను మోసం చేయాయని అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం ఐటి పార్కు పనులు రూపొందుకున్నాయన్నారు. త్వరలో మానేర్ రివర్ ఫ్రంట్‌కు సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 9 నెలలో ఐటి టవర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వేయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 10 కంపెనీలు ఇక్కడికి రావాడానికి సిద్దంగా ఉన్నాయని, అమెరికా కంపెనీ ప్రతినిధులతో చర్చిండానికి జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి అమెరికాకు వెళ్తామన్నారు. ప్రభుత్వ నిధులతో నగరంలో అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికి 240 కోట్లు నగరానికి మంజూరు అయ్యాయాన్నారు. మూడవ విడత బడ్జెట్ వచ్చే లోపు ప్రస్తుత ప్రాజెక్టులన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికలకు పోయే లోపు మానేరు రిఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్, బిసి స్టడీ సర్కిల్, ఐటి హబ్, అంతర్గత రోడ్లు పూర్తి నగరాన్ని సుందరంగా మారుస్తామన్నారు. ప్రజలకు జవాబుతారీతనంగా పనిచేస్తూ ముందుకు సాగుతామన్నారు. గత ప్రభుత్వం అండర్ డ్రైనేజీ పేరిట నగరాన్ని నాశనం చేశారని వాటిని సరి చేసి సుందరంగా తీర్చిదిద్ది ప్రజల మన్నలను పొందుతామన్నారు.
సభ విజయవంతం కోసం సమీక్ష సమావేశాలు
ఐటి టవర్ నిర్మాణం పనుల శంకు స్థాపనకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలకడంతో పాటు ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో, కంట్రాక్టర్లతో, పరిశ్రమల యాజమాన్యులతో సమావేశాన్ని నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు ఏలాంటి ఆటంకాలు ఉండకుండా పోలీసులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల, ఎంపి వినోద్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Comments

comments