Search
Saturday 21 April 2018
  • :
  • :

నిరుద్యోగులకు రూ.3వేల భృతి : ఉత్తమ్

Uttam

సూర్యాపేట : తమ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతిని అందజేస్తామని తెలంగాణ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను తీర్చడంలో సిఎం కెసిఆర్ విఫలమయ్యారని, కేవలం తన కుటుంబంలోనే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. రైతుల రుణ మాఫీ అమలు చేయడంలో కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ బలోపేతానికి బూత్ స్థాయి నుంచి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

TPCC Chief Uttam Comments on TRS Govt

Comments

comments