Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి

Tractor-Roll-Over

నాగర్‌కర్నూలు : ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బొందలపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు బాలపీర్లు దర్గాకు వెళ్లారు. మొక్కలు చెల్లించుకున్న అనంతరం వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కోదండం బావి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతయ్య (45), మౌనిక (16)లు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tractor Roll Over : Two died

Comments

comments