Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

హసన్‌పర్తిలో టిఆర్‌ఎస్ సమావేశం

hall

మనతెలంగాణ / హసన్‌పర్తి : గ్రేటర్ వరంగల్ హసన్‌పర్తి మండల కేంద్రం  57వ డివిజన్ టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం భీమారం డివిఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు హాజరై నేడు జరగబోయే ఎస్సారెస్పి కాలువ వెడల్పు పనులకు వస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్సారెస్పి కెనాల్ వద్ద సభ ఏర్పాట్లను పరిశీలించారు. నేటి సభకు డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బండారి సుమన్, దేవరకొండ అనిల్, తోట నాగరాజు, నంది శ్రీనివాస్, చకిలం చంద్రశేఖర్, పులెంట్ల శ్రీధర్, నాగారాజుయాదవ్, మట్టడ కళ్యాణ్, మూల దేవేందర్, సతీష్‌యాదవ్, సాంబశివరెడ్డి, ఖాదర్‌బాబా, ప్రతాప్, కనకచారి, మట్టెడ సురేందర్, చిత్ర రాజేందర్‌గౌడ్, చిర్ర రాజేష్, కనకచారి, ప్రతాప్, మొగిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

comments