Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..!

Srinivas-Goud

హైదరాబాద్: అధికార టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడిన మాటలు 100 శాతం వాస్తవమన్నారు. ఉద్యమంతో సంబంధం లేనివారు మంత్రివర్గంలో ఉన్నారని చెప్పారు. అది తలుచుకుంటే కళ్ల వెంట నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, సిఎం కెసిఆర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందన్నారు. నాడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్లు నేడు మాటలు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదని శ్రీనివాస్ వాపోయారు. ఇలా నిన్న నాయిని సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇవాళ శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఆ వ్యాఖ్యలను సమర్థించడం గమనార్హం.

TRS MLA Srinivas Goud Sensational Comments.

Comments

comments