హైదరాబాద్ : తెలంగాణలో ఇటీవల జరిగిన ఎంపిటిసి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. 16 ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో గెలిసింది. కాంగ్రెస్, బిజెపిలు చెరో రెండు స్థానాలను దక్కించుకున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల, వనపర్తి జిల్లా గోపాల్దిన్నె, నల్గొండ జిల్లా కిష్టాపురం, ఖమ్మం జిల్లా జక్కేపల్లి, కూసుమంచి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ, భద్రాచలం ఎంపిటిసి ఏడో స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర ఆచంపల్లిలో టిఆర్ఎస్ ఓడిపోయింది. టిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.