Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఇద్దరు విఆర్‌ఏలపై గొడ్డలితో దాడి

vra
-ఒకరి మృతి- ఒకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
-పోలీసుల అదుపులో నిందితుడు
మన తెలంగాణ/కాటారం: భూతగాదాలో గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయలైన ఘటన శుక్రవారం కాటారం మండలంలో చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రానికి చెందిన బొడ్డు రామయ్య(70), బొడ్డు లక్ష్మన్(42)అనే ఇద్దరు కాటారం గ్రామానికి విఆర్‌ఏలు గా పని చేస్తున్నారు. కాటారం గ్రామ శివారులోని సర్వేనంబర్ 501లో గల మాదిగకుంట శిఖం భూమిలో అదే గ్రామానికి చెందిన సొదారి శ్రీనివాస్ అనే వ్యక్తికి, బొడ్డు రామయ్య, లక్ష్మన్‌లకు గత కొన్ని రోజులుగా గొడువలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం భూమిని చదును చేసుకునేందుకు వెళ్లిన రామయ్య, లక్ష్మన్‌లతో శ్రీనివాస్ గొడువకు దిగాడు. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ వారిద్దరి తలలపై గొడ్డలితో దాడి చేయగా రామయ్య తలకు బలమైన గాయం కవడంతో అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మన్ ఘటనా స్థలంలో తీవ్రగాయాలతో ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సమాచారం అందుకున్న కాటారం సిఐ చింతల శంకర్‌రెడ్డి, ఎస్సై జహీర్‌ఖాన్‌లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న లక్ష్మన్‌ను ఘటనా స్థలం నుంచి ఎడ్ల బండిలో మండలకేంద్రానికి తీసుకురాగా 108 వాహనంలో మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. నింధితుడు సొదారి శ్రీనివాస్ హత్యచేసినట్లు లొంగిపోయి పోలీసుల అదుపులో ఉన్నాడు.

Comments

comments