-ప్రమాదానికి గురైన కారు
-ప్రమాదానికి గురైన కుమ్మరి రాములు
మనతెలంగాణ/శంషాబాద్ ః రెండు వేర్వేరు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మంగళవారం రోజు శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిఖిత, జెటిన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనన్య అనే ముగ్గురు మంగళవారం రాత్రి ఐ20 కారులో గచ్చిబౌలి నుండి ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా వచ్చి పెద్దగొల్కోండ వద్ద దిగి పివన్ లింక్ రోడ్డుపై బెంగుళూర్ వైపు బయలుదేరారు. అయితే కారు బుర్జుగడ్డ తాండ వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై బోల్తా కోట్టిందన్నారు. దీంతో అనన్య అనే యువతి అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. అయితే కారులో మధ్యం బాటిల్స్ ఉండడంతో మధ్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు అనుమానిస్తున్నాట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
మరో ప్రమాదంలో కొత్తూరు మండలంలోని హిమ్ములునగర్ గ్రామానికి చెందిన భర్యభర్తలు కుమ్మరి రాములు(72). కుమ్మరి సుగుణమ్మ(60)లు మంగళవారం ఉదయం శంషాబాద్ వైపు వస్తున్నారు. వీరు టీవీఎస్ లూనపై వస్తుండగా గండిగూడ గ్రామం వద్దకు రాగానే వెనుక నుండి షిప్టుడిజైర్ వాహనం ఢీకొట్టడంతో సుగుణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా రాములుకు స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో మృతదేహనికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాములును శంషాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన షిప్టు ఢిజైర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.