Search
Monday 23 April 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం..

car
– కారు ముందు టైరు పగలడమే ప్రమాదానికి కారణం..
మనతెలంగాణ/బాలానగర్‌ః జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న కారు ముందు టైరు పగలడంతో డివైడర్‌ను అవతలి వైపు కారు దూసుకెళ్ళడం.. ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే మృత్యువాత పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాలానగర్ మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ శివారులోని ఎస్‌సిడబ్లు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం శంకర్ పల్లి గ్రామానికి చెందిన మాదవరెడ్డి(56), ఇదే మండలంలోని కక్కులూరు గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు(57)లు మహబూబ్‌నగర్ వైపు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని బెలూన్స్ ఓపెన్ అయినప్పటికి వ్యతిరేక దిశలో వస్తున్న లారీ వేగం అధికంగా ఉన్న కారణంగా కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఇరువులు అక్కడికి అక్కడే మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన గంట వరకు సైతం జిఎంఆర్ వారు స్పందించక పోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం కావడంతో స్థానికుల సహాయంతో పోలీసులు వాహనాన్ని నెట్టించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను జడ్చర్ల కమ్యునిటి ఆసుపత్రికి తరలించారు. బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై గోపాల్ తెలిపారు.

Comments

comments