Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

‘అజ్ఞాతవాసి’తో వెంకీ…!(వీడియో)

Pawan-with-Venkatesh

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ మూవీలో సినీయర్ నటుడు వెంకటేష్ ఓ అతిథి పాత్రలో నటించిన్నట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. మూవీ టైటిల్స్‌లో కూడా వెంకటేష్‌కి స్పెషల్ థ్యాంక్స్ అని ఉండటంతో ఆయన కామియో రోల్ ఖాయమని అంతా భావించారు. కానీ, సినిమాలో మాత్రం వెంకీ పాత్ర ఎక్కడ రాకపోవడంతో అంతా నిరాశకు గురయ్యారు.. దీంతో వెంకీకి సంబంధించిన సన్నివేశాలను కలిపేందుకు అజ్ఞాతవాసి చిత్ర బృందం రెడీ అయింది. సంక్రాంతి కానుకగా ఈ సీన్లను జోడించనున్నారు. ఈ మేరకు ఓ ఫన్నీ మేకింగ్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. అందులో వెంకీ-పవన్ మధ్య నడిచే ఆ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్ చెప్పడం ఉంది. వీడియోలో పవన్..వెంకీని గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.. అని వెంకీ చెప్పటంతో ఇద్దరూ నవ్వుకోవడం మనం గమనించ వచ్చు. అలాగే ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్ అంటే… ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం నవ్వులు పూయిస్తోంది. ఈ నెల 10న విడుదలైన అజ్ఞాతవాసి మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Venkatesh Scenes to be Added in Agnyaathavaasi on Second Week.

Comments

comments