Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పూర్తి హర్రర్ థ్రిల్లర్

Vijay

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం తర్వాత అతనికి ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఆరు సినిమాలను ఓకే చేశాడు. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్‌లో ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత గీతాఆర్ట్ పతాకంపై రాహుల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానే అతని నెక్స్ మూవీ. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటిదాకా యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు హర్రర్ జోనర్‌లో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే తెలుగులో హార్రర్ సినిమాలంటే కామెడీ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమా అలా కాదట. పూర్తిగా హార్రర్ థ్రిల్లర్ అని తెలిసింది. దాదాపుగా పూర్తయిన ఈ సినిమా ఈ వేసవి ప్రారంభంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

comments