Search
Friday 20 April 2018
  • :
  • :

స్పెషల్‌గా ఉండేలా సిద్ధం చేస్తున్నాడు

vkm

‘హలో’ చిత్రం సక్సెస్ కావడంతో ఎంతో ఆనందంగా ఉన్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తన నెక్స్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు విక్రమ్. చైతూతో చేయబోయే సినిమా స్పెషల్‌గా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మనం’ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇక నితిన్‌తో కూడా ఓ సినిమా చేయనున్నాడు విక్రమ్. ‘లై’ దెబ్బకు డల్ అయిన నితిన్‌తో ఒక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడు. నితిన్‌తో చేసిన ‘ఇష్క్’ వల్ల దర్శకుడిగా విక్రమ్ కుమార్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే నితిన్‌కు మరో హిట్‌ను అందించాలనుకుంటున్నాడు. ఇక సూర్యతో ‘24’ చిత్రాన్ని చేసిన విక్రమ్ మరోసారి అతనితో సినిమా చేయాలనుకుంటున్నాడు. సరైన కథతో అతన్ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు.

Comments

comments