Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

వివేకానందుడి జీవితం అందరికీ ఆదర్శం

nanda
మన తెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : స్వామి వివేకానంద జయంతి వేడుకలు మానుకోట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహానికి మాహబూబాబాద్ ఎంపి అజ్మీర సీతారాం నాయక్, జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రపం చ మేధావులలో స్వామి వివేకానంద ఒకరని కొనియాడారు. అందరు వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సలన్ భూక్య ఉమామురళి నాయక్,జిల్లా యువజన మరియు క్రీడ అధికారి బలరామరావు, కైరంకొండ యాదగిరి, ఎన్‌వైకె బాధ్యలు అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నగుడూర్‌లో.. చిన్నగుడూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిబెపి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవా రం ఘనంగా జరిగాయి. బిజెపి మండల అధ్యక్షుడు గుగులోత్ లక్ష్మ ణ్ నాయక్ స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బానోత్ సుమన్, గుగులోత్ కుమార్, లక్కుపతి, సురేష్, నరేష్, వీరన్న, బాలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments