Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

వివేకానందుడి బోధనలు..భవిష్యత్తు తరాలకు నాంది

vivek

*జీవితంలో ఎటువంటి పరిస్థితుల నైనా పోరాటాలతో ఎదుర్కోవాలి
*మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట
వివేకానందుడి బోధనలు భవిష్యత్తు తరాలకు అందించాలని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వివేకానందుని 155వ జయంతి, జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 3కె రన్‌ను జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ వివేకానందుని బోధనల ద్వారా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం పోరాటం చేస్తూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులకైనా సవాళ్లనైనా ఎదుర్కోవాల్సిన సమస్యలను చూసి అధైర్యపడవద్దని వాటిని ధైర్యంతో ఎదుర్కోని ముందుకు పోవాలని ఉద్భోధించారు. నేటి యువత చిన్న చిన్న విషయాలకు భయపడుతూ పిరికితనంతో మంచి  అవకాశాలు ఉన్నా చాలా మంది చలించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందుని బోధనలు మళ్లీ గుర్తు చేసి భవిష్యత్తు తరాలకు కానుకగా అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి యువతి యువకులు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సూర్యాపేట మున్సిపాలిటీకి కార్యాలయంలోని మంత్రి జగదీశ్‌రెడ్డి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విదార్థులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపాలిటీ ఛైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, ఏఎంసి ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, యువజన అధికారి వెంకట్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, పుర ప్రజలు, విద్యార్థులు తదితులు పాల్గొన్నారు.
గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో
నేటి యువకులు వివకేకానందుడిని ఆదర్శంగా తీసుకోని ముందకు సాగాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన బోధనలు ప్రపంచానికి ఆదర్శమని, ప్రతి ఒక్క రు ఆచరించి వారి యొక్క లక్ష్యాలను సాధించుకోవాలని చె ప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు పిండి వనజ, తాహేర్ పాష, తూడి నర్సింహారావు, గండూరి రమేష్, రామకృష్ణ, గ్రంధాలయ డైరెక్టర్ కళ్లేపల్లి మహేశ్వరి, రియాజ్, శారదాదేవి, ఇరిగి కోటేశ్వరి, గునగంటి రాములు, పోలెబోయిన నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.

Comments

comments