Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గోడ కూలి వివాహిత మృతి

body
మన తెలంగాణ/గార్ల ః ప్రమాదవశాత్తు గోడ కూలి వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం పల్లెగూడెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని ముల్కనూరు పంచాయతీ పరిథిలోని పల్లెగూడెం గ్రామానికి చెందిన కొర్స జయమ్మ(38) తన ఇంటి గోడ ప్రమాదవ శాత్తు కూలి ఆమెపై పడింది. ఈ  ప్రమాదంలో జయమ్మ(38)కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు సంఘటన స్థలంకు చేరుకుని గాయపడిన జయమ్మను 108 వాహనంతో ఖమ్మం హాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. సంఘటన తెలుసుకున్న ఇల్లందు శాసన సభ్యులు కొరం కనకయ్య మృతురాలి జయమ్మ మృతదేహాన్ని పరిశీలించి నివ్వరపోయారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ప్రమాదవ శాత్తు మృతి చెందిన జయమ్మ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహయం అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఎంఎల్‌ఎ వెంట స్థానిక తాహాసీల్థార్ ఎ రమేష్, ఎంపిపి వెంకట్‌లాల్, జడ్పిటిసి మాదవి, ఎంపిటిసి కిషన్‌నాయక్ తదితరులు ఉన్నారు.

Comments

comments