Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఇటలీలో వనపర్తివాసి మృతి

JAYA-PRAKASH

వనపర్తి : ఇటలీలో వనపర్తి జిల్లా ఘణపురం మండలం మానాజీపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయప్రకాశ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇటలీలోని అప్రిలియా పట్టణంలో ఉన్న ఐబిఎంలో జయప్రకాశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా అతడు ఆఫీసుకు వెళ్లడం లేదు. దీంతో అతడి తోటి ఉద్యోగులు జయప్రకాశ్ ఇంటికి వెళ్లి చూశారు. ఇంట్లో జయప్రకాశ్ విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జయప్రకాశ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. జయప్రకాశ్‌కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయప్రకాశ్ ఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. జయప్రకాశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వారు సుష్మాను కోరుతున్నారు.

Wanaparthy Man killed in Italy

Comments

comments