Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రెండో భాగ్యనగరంగా వరంగల్

dig*ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దు
*ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో సత్ఫలితాలు
*రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి

మనతెలంగాణ/వరంగల్ క్రైం: వరంగల్ నగరాన్ని రాష్ట్రంలో రెండవ భాగ్య నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధి చెం దితే దేశ, విదేశాల నుంచి పెద్దమొత్తంలో ఇక్కడికి పెట్టుబడులు వస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజలతో వ్యవహరించవద్దని డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిజిపిగా ఎం.మహేందర్‌రెడ్డి బాధ్యత చేపట్టిన అనంత రం తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించారు. గురువారం మధ్యా హ్నం హెలిక్యాప్టర్‌లో నార్త్‌జోన్ ఐజి వై.నాగిరెడ్డితో ఆర్ట్ అండ్ సైన్స్ గ్రౌండ్స్‌లో చేరుకు న్న డిజిపికి పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుతో పాటు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డిజిపి వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా నెలకొల్పబడిన కమాండ్ కంట్రోల్ సెం టర్‌ను ప్రారంభించడంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంట్రల్ పనితీరును డిజిపి పోలీస్ అధికారులను, అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు డిజిపి పలు సూచనలు చేయడంతో పాటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. అనంతరం డిజిపి పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన నేరాలతో పాటు నేరస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిపి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ అధికారులతో కాజీపేటలో నిట్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముందుగా కమిషనర్ సుధీర్‌బాబు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ పద్ధతి ద్వారా వివరించారు. అనంతరం కమిషనరేట్ పోలీస్ అధికారులను ఉద్దేశిస్తూ డిజిపి ప్రసంగిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ఎన్నో సత్ఫలితాలను సాధించిన పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, వరంగల్ నగరాన్ని రాష్ట్రంలో రెండవ భాగ్యనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షమన్నారు. ముఖ్యంగా అభివృద్ధి సాధించడంతో దేశం నుంచి నలుమూలల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టి, పలు ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడంతో పాటు, ప్రజల కోలమానం పెరుగుతుందని, ఇందుకోసం వరంగల్ నగరాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కోరికని, అందుకోసమే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిసిపిలు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, అదనపు డిసిపిల పూజా, మురళీధర్ ఉన్నారు.

Comments

comments