Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

నీటి వాటాలో అన్యాయం!

river

*డి/83 బికి బంద్.. డి/86కి సరఫరా
*ఎండుతున్న నారుమళ్లు…
*పదివేల ఎకరాల స్థితి దయనీయం
*ఆందోళనలో రైతాంగం

మనతెలంగాణ/ధర్మారం: వారబంది నీటి విడుదల ధర్మారం,వెల్గటూర్ మండలాల రైతాంగానికి అంద ని ద్రాక్షగా మారింది. ఇప్పటికే నారుమళ్ల్లు పోసి నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా, ఎస్సారెస్పి నుంచి నీరు వస్తున్న డి 83 బికి గేట్లు మూసి డి 86కి నీరు సరఫరా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల మ ధ్య సమన్వయ లోపం, ఎస్సారెస్పి, వ్యవసాయశాఖ అ ధికారుల నిర్లక్షం మూలంగా పదివేల ఎకరాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎస్సారెస్పి నుంచి అన్ ఆఫ్ పద్దతిలో వారం రోజులు నీళ్ళుయిస్తూ, ఎనిమిది రోజుల పాటు ప్రధాన గేట్లు మూస్తున్నారు. గత డిసెంబర్ 25 నాడు తొలిసారిగా నీటిని వదలగా 27 నాడు చొప్పదండి మండలం రెవెళ్ళె రెగ్యులేటర్‌కు చేరింది. డి/83 బి ద్వారా ధర్మారం,వెల్గటూర్ మండలాల్లో, 14 వేల ఎకరాలుండగా పదివేల ఎకరాలు సాగుకు సిద్ధం చేశారు. క్రింద ఉన్న డి/86 కి నీరు వదలిన అధికారులు డి/83 బి కి మాత్రం కేవలం 30వ తేది ను ంచి 2వ తేది వరకు రోజుకు 842 క్యూసెక్కుల చొ ప్పున 3368 క్యూసెక్కులు నామమాత్రంగా వదిలా రు. రెండవ ధపాలో గత బుధవారం నీరు వదలగా గు రువారం రెగ్యులేటర్‌కు చేరింది. మళ్లీ డి/83 బి మూ సివేసి డి,86 కి 1426 క్యూసెక్యులు నిరంతరం వదలుతున్నారు. ఎస్సారెస్పి ప్రధాన కాల్వ సామర్థం 8 వేల క్యూసెక్కులు కాగా నిత్యం 5 నుండి 6 వేల క్యూ సెక్కులు వదలుతుండగా,మెట్‌పల్లి, జగిత్యాల డివిజన్ల నుండి రెవెళ్ళ రెగ్యులేటర్‌కు చేరేసరికి సామర్థం తగ్గుతుండగా,వచ్చిన మొత్తం నీటిని డి 86 ద్వారా సుల్తానాబాద్, ఓదేల, కాల్వ శ్రీరాంపూర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా పైన ఉన్న డి,83 బిని మూసి డి,86 ద్వారా నిరంతర సరఫరాపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరో మూడు రోజుల్లో గేట్లు మూసే అవకాశం ఉం డగా రెండవ ధఫాలోను సక్రమంగా నీరు వచ్చే అవకాశాలు లేక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదివేల ఎకరాలు బీళ్లుగా మారు అవకాశాలున్నాయి.ఇక్కడి ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, ఎస్సారెస్పి, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్షంతో రైతులకు అన్యాయం జరుగుతుంది. మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్ విప్ ఈశ్వర్ వెంటనే జోక్యం చేసుకొని శనివారం నుంచి నీరు వదలని పక్షంలో రై తులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది.

Comments

comments