Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

క్యాడర్ ఉన్న పార్టీ మనది

hrsh

*గ్రూపు రాజకీయాలు చేయొద్దు
*కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు హితవు
*గజ్వేల్ టిఆర్‌ఎస్ మీటింగ్‌లో కార్యకర్తల రభస

గజ్వేల్ (మర్కుక్) : క్యాడర్ ఉన్న పార్టీ మనది…. కార్యకర్తలు గ్రూపు రాజకీయాలు చేయొద్దు… పార్టీని కుటుంబంలా భావించి పార్టీ బలోపేతానికి, పటిష్టతకు పనిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన టిఆర్‌ఎస్ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈనెల 18వ తేదీ నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కమిటీలు వేసుకొని పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. ప్రతిరోజూ నాలుగు మండలాల చొప్పున త్వరితగతిన కమిటీలు పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాల్లో ఎంతో సాధించిందని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నారన్నారు. గజ్వేల్‌నియోజకవర్గంలోని ఐదు మండ లాలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకువచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు, వివిధ పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొనియాడుతున్నారని అన్నారు. గజ్వేల్‌కు డిసెంబర్ లోగా రైలు కూత వినపడటం ఖాయమన్నారు. యాదవులకు పెద్దపీట వేసిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. గజ్వేల్‌లో మార్కెట్ యార్డు అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. తూప్రాన్‌లో మార్కెట్ యార్డును కోటి రూపాయలతో మంజూరు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను తీసుకువచ్చి పేద కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. 24 గంటల కరెంట్ తీసుకువస్తే తాను పార్టీ కార్యకర్తగా వుంటానని నాడు చెప్పిన జానారెడ్డి తన మాట మీద నిలబడలేదని విమర్శించారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. అప్పట్లో పనిచేసిన ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా కార్యకర్తలు పనిచేసి పార్టీకి పట్టు కొమ్మల్లా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా చైర్మన్ నర్సారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, రంగారెడ్డి, జహంగీర్, నర్సారెడ్డి, పద్మనారాయణ, శ్రీధర్‌గౌడ్, చిట్టి మాధురి, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో రభస : టిఆర్‌ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమావేశం ప్రారంభంలోనే రభస నెలకొన్నది. సమావేశం ఆరంభంలో ఓ కార్యకర్త లేచి గృహ నిర్మాణ శాఖ చైర్మన్ భూంరెడ్డి తమను కులం పేరుతో దూషించడంతో పాటు కార్యకర్తలను పురుగుల మాదిరిగా చూస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ నాయకుడు తమకొద్దని సమావేశంలో బహిరంగంగా డిమాండ్ చేశారు. దీంతో భూంరెడ్డి అనుచరులు కొందరు వేదిక మీదకు రావడంతో కొద్దిసేపు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సమస్య సద్దు మణిగింది. అనంతరం భూంరెడ్డి మాట్లాడుతూ ఎవరినైనా మనస్సు నొప్పిస్తే క్షమించాలని, కార్యకర్తల పట్ల ఎప్పటికీ కృతజ్ఞుడిగా వుంటానన్నారు.

Comments

comments