Search
Sunday 21 January 2018
  • :
  • :

పాక్‌ను ఎలా అదుపు చేయాలో తెలుసు

Trumpవాషింగ్టన్ : పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలన్న విషయంలో అన్ని రకాల మార్గాలు టేబుల్‌పై సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం వెల్లడించింది. తాలిబన్లు, హక్కనీ నెట్‌వర్క్ ఉగ్రవాదుల పై పాక్ తగిన చర్యలు తీసుకోకపోతే ఏం చెయ్యాలో తమకు తెలుసని హెచ్చరించింది. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంలా ఉంటోందని ఆరోపిస్తూ అమెరికా అధ్య క్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. పాక్‌కు అమెరికా దాదాపు 2బిలియన్ డాలర్ల సహా యాన్ని నిలిపేసిన అనంతరం అమెరికా మరోసారి ఈ విధంగా హెచ్చరించింది. అమెరికా-పాక్‌ల మధ్య ఈ పరిస్థితిని పరిష్కరించే విషయంపై ఎలాంటి అనుమానం అవసరం లేదని ..అందుకు అన్నిమార్గాలు టేబుల్‌పై ఉన్నాయని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాక్‌పై తీసుకునే చర్యల గురించి కచ్చితమైన వివరాలు వెల్లడించలేమని, కానీ, తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉగ్రస్థావరాలపై పాక్ దాడులు జరపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, అలా జరిగితే ఇరు దేశాల మధ్య తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల అంశంపై పాక్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పరస్పర సహకారానికే మొగ్గు చూపుతుందని తెలిపారు. ఉగ్రవాదుల విషయంలో అమెరికా ఎంత సీరియస్‌గా ఉందో పాక్ గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముష్కరులపై పాక్ తీసుకునే చర్యలను బట్టే తిరిగి అమెరికా నుంచి సాయం పొందే అంశం ఆధార పడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
పాక్‌కు ఎలాంటి సాయం చేయబోం : వాషింగ్టన్: ‘రానున్న రోజుల్లో పాకిస్థాన్‌కు అమెరికా అందించే సాయాన్ని మొత్తం నిలిపివేయాలని బిల్లును ప్రవేశపె డతాను. ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని మన దేశంలోని రహదారుల నిర్మాణం, మౌలిక సదు పాయాలను మెరు గుపరుచుకునేందుకు ఉపయోగించాలి. మన దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.. అంతేకానీ ఇతర దేశాలను కాదు. విదేశాలకు సాయం చేయడానికి ముగింపు పలికి మన దేశాన్ని వృద్ధి చేసు కోవాల్సిన సమయం ఇది’ అని అమెరికా సెనెటర్ రాండ్ పౌల్ మాట్లాడుతున్న వీడియోను శుక్రవారం ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ స్పందించారు. చాలా ‘మంచి ఆలోచన’ రాండ్ అంటూ అభినందించారు. ‘మా దేశం జెండాలను తగులబెడుతున్న పాకి స్థాన్ వంటి దేశాలకు యూఎస్ ఇక కొంచెం కూడా సాయం చేయదు. 2002 నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 33 బిలియన్ డాలర్ల సాయాన్ని ఇచ్చాం. కానీ వాళ్లు మాకు తిరిగి ఏం ఇచ్చారు? గత కొన్నేళ్లుగా బిన్‌లాడెన్ ఆ దేశంలో నివసిస్తుంటే కనీసం అతడిని పట్టుకునేందుకు కూడా సాయం చేయలేదు. లాడెన్‌ను పట్టుకునేందుకు సాయం చేసిన వాళ్లని జైల్లో పెట్టింది’ అని రాండ్ వీడియో ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments