Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజక్టు పూర్తి చేస్తాం

harish

*రోజుకు రెండు లక్షల బస్తాల సిమెంటు వినియోగం
*మూడు షిప్టుల్లో రాత్రింబవళ్లు పనులు
*మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేట ఎస్‌ఎంహెచ్, బిసి హాస్టల్లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. వాస్తవానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 10 సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 20 నెలల కాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందని వివరించారు. ప్రతిరోజూ రెండు లక్షల బస్తాల సిమెంటును వినియోగిస్తూ మూడు షిప్టుల్లో రాత్రింబవళ్లు ఎముకలు కొరికే చలిలో పది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న గడువులోగా పూర్తి చేస్తే రైతు ఆత్మహత్యలను నివరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును నిర్మించి రైతుల కంటి నీటిని తుడిచి వారి ముఖాల్లో సంతోషాన్ని చూస్తామన్నారు. విద్యార్థులు దేశ స్థాయిలో పోటీపడాలని కేవలం పాస్‌తోనే సరిపెట్టకుండా ఉత్తమంగా రాణించాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలు బలోపేతమైనాయని ముఖ్యంగా వైద్య, విద్యారంగాలను మరింత బలోపేతం చేయడంతో ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తెస్తానని దీని కోసం ప్రత్యేకంగా కంప్యూటర్‌తోపాటు, ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పిస్తానని వీటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు పొందాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎంహెచ్, బిసి హాస్టళ్లలో కేక్ కట్‌చేసి విద్యార్థులతో కలసి హరీశ్‌రావు భోజనం చేశారు. ఈ సందర్భంగా రెండు హాస్టల్ విద్యార్థులతో అర్థరాత్రి వరకు కలసి ముచ్చటించారు.

Comments

comments