Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పచ్చదనం ఉట్టిపడేలా శ్రమిస్తాం

sp*పోలీస్ శాఖకు మంచి పేరు తేచ్చేందుకు యంత్రాంగం సిద్దపడాలి
*జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట శ్రమదానం
*పాల్గొన్న ఎస్పీ ప్రకాష్‌జాదవ్, పోలీస్ సిబ్బంది

మన తెలంగాణ/సూర్యాపేట: జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆహ్లాదకరంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు యంత్రాంగం, సిబ్బంది నూతనోత్సాహంతో తయారు చేస్తున్నారని జిల్లా ఎస్పీ ప్రకాష్‌జాదవ్ అన్నారు. పోలీస్ పిటికెలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన శ్రమదానం, స్వచ్ఛత కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేయడం, మొక్కల కు గుంత లు తీయడం, పరేడ్ గ్రౌండ్ క్లీన్ చేయడం జరిగిందని ఎస్పీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల అనుసారం జిల్లాను పచ్చదనం చేయడంలో పోలీసులు అత్యంత శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరి పను లు వారు స్వతహాగా చేసుకునే తత్వాన్ని పోలీసులు అలవర్చుకున్నట్లు వివరించారు. ఇందు లో భాగంగానే సిబ్బంది మొక్కల చుట్టూ అందమైన ఆకృతిలో ఇటుకలను అమర్చినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఇస్మాయిల్, డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సిఐలు ప్రవీణ్‌కుమార్, శంకర్, ఎస్‌బి ఇన్స్‌స్పెక్టర్ రాఘవరావు, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆర్‌ఐలు శ్రీనివాస్, నర్సింహారావు, ఎస్‌ఐలు దానియేల్, క్రాంతి, సంతోష్, బాసిత్, ఆర్‌ఎస్‌ఐ సంతోష్, ఎఆర్‌ఎస్‌ఐలు , ఎఆర్‌పిసిలు , ఎఆర్‌హెచ్‌సిలు సిబ్బంది పాల్గొన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి ప్రకాష్‌జాదవ్ తన యంత్రాంగంతో కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తె చ్చేందుకు అధికారులు ,సిబ్బంది తీవ్రంగా శ్రమించాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా శాఖ సంబంధిత పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే శిక్షణ తరగతులను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధనపు ఎస్పి ఇస్మాయిల్, ఎవో మంజుభార్గవి, సెక్షన్ సూపరిడెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ మొయిన్, గౌతమ్, జూనియర్ అసిస్టెంట్స్ సిరాజుద్దీన్, శ్రీను, రాజు, అశోక్, సోమయ్య, విద్యాసాగర్, నాగరాజు, షకీల్, కరుణశ్రీ, భారతి, ప్రమోద, నిర్మల, ఎస్‌బి సిఐ రాఘవరావు, ఆర్‌ఐ శ్రీనివాస్, డిసిఆర్‌బి ఎస్‌ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments