Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సంపన్నులే మనదేశాన్ని పరిపాలిస్తున్నారు

cpi

మన తెలంగాణ/కాశిబుగ్గ : మనదేశ పార్లమెంటులో 400 మందికిపైగా రూ.వంద కోట్ల ఆస్తులు కలిగిన ఎంపిలుగా కొనసాగుతున్నారని, పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు రూ.లక్షల కోట్లు రాయితీ ఇచ్చి, ప్రజల సంక్షేమం మాధ్యేయమని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చి నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పౌరుడికి రూ.15 వేలు అకౌంట్‌లలో వేస్తామని చెప్పి పెద్దనోట్ల మార్పిడి వలన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ విమర్శించారు. సిపిఐ వరంగల్ మార్కండేయ నగర్ 5వ మహాసభలు దండు లక్ష్మన్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన  తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జిఎస్‌టి వలన చిన్న తరహా పరిశ్రమలు, దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కరువై రోడ్డున పడ్డారని, రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక అన్న పాలకపక్ష పార్టీలు కాని ఎన్‌డిఎ ప్రభుత్వం పన్నుల రూపంలో రైతుల మీద పెనుభారం మోపిందని వారన్నారు. దేశంలో నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు అరికడతామని కాని దళితులపై, ఆదివాసిలపై, మైనార్టిలపై, అభ్యుదయ వాదులపై దాడులు ఆర్‌ఎస్‌ఎస్, సంఘ పరివార్ చేస్తున్న కేంద్రం నామమాత్రంగా స్పందిస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కొరవడిందని పరిరక్షణ కోసం కార్యకర్తలు నడుం బిగించాలని అన్నారు. పోతరాజు సారయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని విద్యార్థులకు కెజి టు పిజి విద్య ఉచితంగా అందిస్తామని, దళితులకు మూడు ఎకరాలు పథకం అందించడం దోపిడి రహిత సమాజం కోసం నిరంతరం సిపిఐ పార్టీ ఉంటుందన్నారు. జాతీయ పంపిణీ రేషన్‌షాపుల ద్వారా 18 వస్తువులను అందించి పేదలు పస్తులు ఉండరాదని కెసిఆర్ అన్నారు. కాని నేడు కేవలం రెండు వస్తువులు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం ఎవరి కోసం వీరి పరిపాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నియంత దొరల నిజాంను మరిపించే విధంగా పాలన చేస్తున్న కెసిఆర్ ముఖ్యమంత్రి చరమగీతం పాడాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, కర్రె భిక్షపతి, ఎస్‌కె.భాషుమియా, పనాస ప్రసాద్, ఏషబోయిన శ్రీనివాస్, బుస్స రవి, సదానందం, గన్నారపు సతీష్, ఒర్సు రాజు, చిలుకల రాజు, అక్బర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments