Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

నిజామాబాద్ కేంద్ర ఆసుపత్రిలో త్వరలో వెల్‌నెస్ సెంటర్

madamహెల్త్ స్కీం సిఇఒ కల్వకుంట్ల పద్మ వెల్లడి

మనతెలంగాణ/నిజామాబాద్ క్రైం: నిజా మాబాద్ నగరంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో త్వరలోనే వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామ ని ఆమె అన్నారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, జర్నలిస్టులు, పదవీ విరమణ పొందిన వారికి వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు హెల్త్ స్కీం సిఇఓ కల్వకుంట్ల పద్మ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని శుక్రవారం కలెక్ట రేట్ రెవెన్యూ అతిథి గృహంలో ఎంసిఆర్ సిహెచ్‌డి శిక్షణ కేంద్రాన్ని ఆమె పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సుమారు 40వేల వరకు ఉన్నాయని చిన్న జ్వరం  నుండి పెద్ద క్యాన్సర్, వివిధ రోగాలకు ఉచిత వైద్యంతో పాటు మందులు అందించడం జరుగుతుందని అన్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో అత్యాధునిక పరికరాలతో పాటు జనరల్ ఫిజిషియన్, యోగా, హోమియోపతి, సంబం ధించిన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం రెవెన్యూ అతిథి గృహంను వెల్‌నెస్ సెంటర్ కోసం అద్దెకు కాకుండా ఉచితంగా అందిస్తే అన్ని హంగులతో తీర్చిదిద్ది వైద్య పరికరాలు, సంబంధిత వైద్యులను నియమిస్తామని అన్నారు. జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అనంత రం టిఎన్‌జిఓల సంఘం అధ్యక్షులు అలుక కిషన్, రెవెన్యూ సిబ్బందితో కలిసి రెవెన్యూ అతిథి గృహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమ ంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments