Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పురాణాలలో 108 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి?

Temple-image

భారతావనిలో ఆధ్యాత్మికం ఎక్కువ. 120 కోట్ల జనాభాలో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్యత ఉన్నది. అదేమిటో చదవండి. * ఉపనిషత్తులు 108 * అష్టోత్తర నామావళి 108 * జపమాలలో పూసలు 108 * చంద్రునికీ, భూమికి మధ్య వున్న దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.* ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది, * శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి… మొత్తం 108 * దేవభాషలో అక్షరాలు 108 * భరతుడి నాట్యశాస్త్రంలో నాట్యభంగిమలు 108 *దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి * 108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం.* 108 సార్లు హనుమాన్ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం, * తెలుగు రాష్ట్రాల్లో 108 ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఆపత్భాందవి… రోగులను ఆసుపత్రికి తీసుకెళ్తుంది.

Comments

comments