Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఇసుక కోసం చంపుతారా?

ప్రశ్నించిన పాపానికి ఎఫ్‌ఐఆర్‌లు, చిత్రహింసలా?
నేరెళ్ల ఘటనపై ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిందే
బహిరంగ సభలో నాయకులు

Kodanda-Ram

మన తెలంగాణ/సిరిసిల్ల/సిద్దిపేట: ‘ఇసుక కోసం సామా న్యులను చంపుతారా? గతంలో ఏ ప్రభుత్వం చేయని వి ధంగా ఇసుక మాఫియాను ప్రశ్నించిన పాపానికి 35 మం దిపై ఎఫ్‌ఐఆర్‌లు న మోదు చేసి, ఎనిమిది మందిని అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేస్తారా?’ అంటూ వామపక్షాలు, జెఎసి నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శని వారం రాజ న్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేరెళ్ల ఘటనపై సిఎం కెసిఆర్ నోరు వి ప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కెటిఆర్ సిరిసిల్ల ప్రాం తంలో అరాచకాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. బా ధితులకు వామపక్షాలు, జెఎసి, ప్రజాస్వామిక వా దులు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కా మారెడ్డిలో రెండు రోజుల క్రితం విఆర్‌ఎను ఇసుక మాఫి యా హత్య చేసిన ఘటన ను గుర్తుచేశారు.

పాదయాత్రకు అనుమతి కావాలని, వారం రోజుల ముందే దరఖాస్తు చేసు కున్నా పోలీసులు మాత్రం ఒకరోజు ముందు అది కూడా సాయంత్రం వేళ అనుమతించారన్నారు. జెఎసి చైర్మన్ కో దండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల పెత్తనంలోనే ఇ సుక మాఫియా నడుస్తోందని, దీనికి అందరూ వ్యతిరేకిం చాలని పిలుపునిచ్చారు. నేరెళ్ల బాధితులపై చర్యలకు పాల్ప డిన పోలీసులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏమిట ని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఇష్టా రీతిగా దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో సిఎం బంధువర్గం ఇసుక దందాను నిర్వహి స్తోందని ఆరోపించారు. అంతకుముందు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ది పేట అమరవీరుల స్తూపం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల వరకు దాదాపు 26 కిలోమీటర్ల పాదయాత్రను వామ పక్షాలు, జెఎసి నేతలు నిర్వహించారు.  తొలుత ఉదయం సి కింద్రాబాద్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద వామ పక్షాలు, టిజెఎసి, టిపిఎఫ్ నేతలు నివా ళులర్పించి నేరుగా సిద్దిపేటకు చేరుకొని పాదయాత్ర నిర్వహించారు.

Comments

comments