Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా వివేకనంద బోధనలు

enjoy

మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : వివేకానందుడి బోధనలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా యు వజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన వివేకానందుడి 155 వ జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అథితిగా హాజరయ్యారు. వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత తమ ఆలోచనలతో ప్రపంచ దృక్పధాన్ని మార్చవచ్చన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన సాం సృ్కతిక కార్యక్రమాలుఆకట్టుకున్నాయి. ఏకవీర, మిట్లు రవిల ఆధ్వర్యంలో నిర్వహించి న సాంప్రదాయ నృత్యప్రదర్శనలకు వీక్షకు ల నుంచి మంచిస్పందన లభించింది. జిల్లా స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చిన నృత్య బృందాలకు మంత్రి జోగు రామన్న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివేకానంద జీవితంపై ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, యువజన సంఘాలకు జేసీ కృష్ణారెడ్డి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనీష, యోగానంద సరస్వతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, బోజారెడ్డి, డివైఎస్‌ఓ వేంకటేశ్వర్లు, రిటైర్డ్ అధ్యాపకులు చల్ల విజయ్‌బాబు, పార్థసారధి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments