Search
Sunday 21 January 2018
  • :
  • :

అందరి సహకారంతోనే..అభివృద్ధి పనుల్లో వేగం

babumohan

* ఎమ్మెల్యే బాబుమోహన్

మన తెలంగాణ/టేక్మాల్ : మం డలంలో జరుగుతున్న అభివృద్ధి ప నులకు అందరు సహకరించాలని అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ అ న్నారు. శుక్రవారం టేక్మాల్ మండ లంలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. మండల పరిధిలోని అచ్చ న్నపల్లి గ్రామం నుండి చంద్రు తాండా వరకు 41 లక్షలు, ఎల్లుపేట పిడబ్లుడి రోడ్డు నుండి దం డువానికుంట వరకు 25లక్షలు, ఎల్లుపేట నుండి శా బాద్ తాండా వరకు 28 లక్షలు, మొత్తం రూ.1.19కోట్ల వ్యయంతో బిటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వెల్పుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎస్సీ కాలనీకి డబుల్ బెడ్ రూం ఇండ్లు, లో ఓల్టేజి ట్రాన్స్‌ఫార్మర్, ఎత్తిపోతల పథకం పైపులైన్ మరమ త్తుకు నిధుల మంజూరు చేయడం జ రింది. ప్రబుత్వం అభివృద్ధి కోసం అ నేక నిధులను మంజూరు చేస్తుందని, నిధులను సక్రమంగా వినియోగించు కోవాలని అధికారులకు సూచించా రు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు రావాలన్నా రు. ఇది మాటల ప్రభుత్వం కాదని చే తల ప్రభుత్వమని ఆయన అన్నారు.
అందుబాటులోకి వైద్యం
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు అం దుబాటులోకి ప్రభుత్వ వైద్య సేవల ందించాలనే ఉద్దేశ్యంతో ప్రాథమిక ఆ రోగ్య ఉపకేంద్రాన్నివెల్పుగొండ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. అనంతరం ఉప జిల్లా వైద్యాధికారి ఈర్షద్ మాట్లాడు తూ మండలంలోని 13 గ్రామాల ప్రజలకు ఈ పిహెచ్‌సి నుండి వైద్య సేవలను అందివ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రదీప్, ఎంపిడివో విష్ణువర్ధన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసీల తో టిఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ యూసుఫ్, సిద్దన్న, వీరన్న, శ్రీధర్, పౌలు, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments