Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య

farer

మనతెలంగాణ/వెల్దుర్తి : వ్యవసాయం సాగుచేయడం కోసం బోరుబావులు వేసి అందులో నీరు పడకపోవడంతో మనస్థాపానికి గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండ౬ల పరిధిలోని కొప్పులపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పాంబండ రాములు (33) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో సాగుకోసం గత రెండేళ్ల క్రితం నాలుగు బోరుబావులు తవ్వించగా చుక్కనీరు కూడా పడకపోవడంతో ఎకరం భూమిని అమ్మి అప్పులు తీర్చాడు. ఉన్న ఎకరాలో నెల రోజుల క్రితం మరో రెండు బోరుబావులు తవ్వించగా వాటిలో కూడా నీరుపడక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేనేమోనని, కుటుంబ పోషణకు భారం కావడంతో బుధవారం నాడు రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాములు మొదటి భార్య మృతి చెందడంతో గత సంవత్సరం క్రితం రజితను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు సామ్య, అఖిల్ ఇద్దరు పిల్లలు ఉండగా రజితకు అమ్మాయి, తల్లి మల్లమ్మలు ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ టిఆర్‌ఎస్ నాయకులు నర్సింహారెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే సహకారంతో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

comments