Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

ట్వీన్సే కానీ.. ఏడాది తేడాతో పుట్టారు!

Twins-Born-in-Different-Yea

న్యూయార్క్: వారు కవలలే కానీ  వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అదేలా సాధ్యమనుకుంటున్నారా? నిజమే ఇది చాలా అరుదుగా జరిగే విషయమే. ఈ కొత్త సంవత్సరం నాడు అగ్రరాజ్యం అమెరికాలో జరిగిందీ వింత. అయితే ఈ కవలలు జనవరి 27న జన్మించాల్సి ఉంది. కానీ ఆ తల్లికి ముందుగానే నొప్పులు వచ్చాయి. సరిగ్గా డిసెంబర్ 31 రాత్రి పురిటీ నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. 20 నిమిషాల తేడాలో కవలలు జన్మించారు. కానీ సంవత్సరాలే మారిపోయాయి. మొదట బాబు డిసెంబర్ 31, 2017 రాత్రి 11:58కి జన్మించాడు. అనంతరం పాప జనవరి 1, 2018 12:16 గంటలకు జన్మించింది. దీంతో ఈ కవలల పుట్టిన తేదీలలో ఏకంగా ఏడాది తేడా వచ్చేసింది.  ప్రతి వెయ్యి మందిల్లో కేవలం నాలుగు సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందట. అందులోనూ ఇలా రోజులు, సంవత్సరాలు వేరు కావడం మరింత అరుదు అనే చెప్పాలి.

Comments

comments