హైదరాబాద్: మోహిద్ పట్నంలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. దుండగులు వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి మహిళను తోసేశారు. తీవ్రంగా గాయపడిన మహిళను వాహనదారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.