Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అన్ని రంగాలపై మహిళలు ఆసక్తిచూపాలి

mahila

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : మహిళలు అన్నిరంగాలపై మరింత ఆసక్తిచూపుతూ ఉన్నతస్థాయి శిఖరాలను అధిరోహించాలని టి-మాస్ జిల్లా చైర్మెన్, కన్వినర్లు భట్టురాంచంద్రయ్య, కల్లూరి మల్లేశంలు ఆకాంక్షించారు. పట్ట ణ కేంద్రంలోని హన్మాన్‌వాడలో తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక టీ-మాస్ జిల్లా కమిటి సభ్యులు కోలుపుల వివేకానంద అద్యక్షతన శనివారం సం క్రాంతిని పురస్కరంచుకొని ముగ్గులపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రో జు-రోజుకు కునుమరుగవుతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ దేశంలో మహిళపై జరుగుతున్న దాడులు హత్యలు, అత్యాచారాలను ఎండగడుతూ ఉద్యమించాలన్నారు. టీ-మాస్ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ ఎస్‌ఐ భర్లపోశయ్య, ఎక్సైజ్ రిటైర్ ్డ సిఐ సిరుమని గంగరాములు మాట్లాడుతూ మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ ముగ్గుల పోటీలలో 55మంది పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహక బహుమతులు విజేతలకు అందజేశారు. వక్తలుగా పాల్గొన్న మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ భట్టుపల్లి అనురాధ, వైఎల్‌ఎన్‌ఎస్ బ్యాంక్ మేనేజర్ వనిత, మాటూరి కవిత, సంఘ్ అనిత, కల్లూరి నాగమణి, మాటూరి కవితలు కనుమరుగవుతున్న సంస్కృతి, సాంప్రదాయాలు అనే అంశంపై వారు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీ-మాస్ జిల్లా కమిటీ సభ్యులు చల్లగురుగుల రవిబాబు, దాసరి పాండు, మాయక్రిష్ణ, బర్ల వెంకటేష్, వనంరాజు, నాయకులు గంగయ్య, పడిగెం కిషన్, ఆరె విజయ్, మేడబోయిన సాయి, నరాల నర్సింహ్మ, బొర్ర లక్ష్మణ్, వంశీ, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments