Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

cong

నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి

మన తెలంగాణ/దుగ్గొండి: మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుందని నర్సంపేట ఎంఎల్ ఎ దొంతి మాదవరెడ్డి అన్నారు. మండలంలోని మహ్మాదాపురం గ్రామ శివారు గుడ్డేల్గులపల్లిలో మహిళా సమాఖ్య భవనానికి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడు తూ మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల కు రుణాలను అందించడానికి కృషిచేశారన్నారు. ఆనాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పావలా వడ్డి రుణాలను లక్ష వరకు అందించామని తెలిపారు. మహిళలు బ్యాంకు రుణాలతో ఆర్దిక పరిపుష్టి సాదించి అభివృద్ది చెం దాలని కుటీరపరిశ్రమలను ఏర్పాటు చేసుకోని ఎదగాలన్నారు. మహిళలు స్వయం సమృద్ది సా దించడానికి కావాల్సిన సహాయ సహాకారాలను అందిస్తామని తెలిపారు.
సన్నకారు రైతులు వ్యవసాయంతో పాటు కూరగాయల పెంపకం, కోళ్ల పెంపకం, పశువుల పెంపకాన్ని చేపట్టి పొదుపును అలవర్చుకుని కుటుంబ అవసరాలను తీర్చుకోవాలన్నారు. గ్రామానికి కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, మంచినీటి బోర్లు ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు…
గ్రామానికి చెందిన వివిద పార్టిల నుండి 17 మంది కార్యకర్తలు గ్రామ పార్టి అద్యక్షుడు తొర్రూ రు భిక్షపతి ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి దొంతి కండువా లు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టిలో చేరిన వారిలో కోమండ్ల పోశాలు, రాజన్న, చెల్పూ రు నర్సయ్య, చెల్పూరు రాజయ్య, అశోక్, సంతోష్, జంగలి రాజు, చిరంజీవి, లక్ష్మయ్య, బాబు, రహీం, నాగేష్, శ్రీను, ముప్పు రవి, ముప్పు రాజన్నలతో పాటు పలువురు చేరారు. ఈకార్యక్రమంలో ఎపిఎం రాజ్‌కుమార్, విఓ అద్యక్షురాలు లలిత, సిసి అరుణ, మండల పార్టి అద్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు హింగె మురళిదర్, వైస్ ఎంపిపి ఊరటి మహిపాల్, లంక మురళి, నర్సంపేట మండల పార్టి అద్యక్షుడు బానోతు లక్ష్మణ్, శంకేషు కమలాకర్, మాదారపు సాంబయ్య, కూస రాజు, ముస్కు రాజు, అమ్మ రోహిత్, బొమ్మినేని భరత్‌రెడ్డి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments