Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మహిళా చైతన్యంతోనే రాష్ట్ర ప్రగతి

hall

మన తెలంగాణ/తాండూరు టౌన్: మహిళా చైతన్యంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి ప ండగ సందర్భంగా శనివారం తాండూరు పట్టణంలో  టిఆర్‌ఎస్ మహిళా వి భాగం ఆధ్వరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ము గ్గుల పోటీ కార్యక్రమానికి మంత్రి హాజరై విజేతలకు బహుమతులు అందజేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను మరింత ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. మహిళా చైతన్యంతో రాష్ట్ర ప్రగతికి,బంగారు తెలంగాణకు బాటలు వేస్తుందన్నారు. త్వరలోనే తాండూరులో మహిళలకు అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో రాజేందర్‌రెడ్డి పేరిటా వార్డుల వారిగా వివిధ పోటిలను నిర్వహిస్తామన్నారు. ముగ్గుల పోటిలకు మహిళలు ఇంత పెద్దఎత్తున్న హజరు కావడం సంతోషదాయకమన్నారు.సిఎం కెసిఆర్ మహిళకు అధ్యక ప్రధాన్యతను ఇవ్వడంతో బతుకమ్మ,క్రిస్టమస్,రంజాన్ పండగలను చీరల పంపిణి చేశారని అన్నారు.అన్ని కులాలను ఆదుకోవడానికి సిఎం కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తాండూరు నియోజవర్గంలో 1250మంది మహిళల వివాహాలకు రూ.6.50లక్షల నిధులు కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం కింద అందించామన్నారు.ఈ ముగ్గుల పోటిలకు మహిళకు పెద్దఎత్తున హజరైనారు.ముగ్గుల పోటిలలో గెలుపొందిన మహిళకు మొదటి బహుమతి కింద తులం బంగారం, ద్వితియ బహుమతి కింద మూడు గ్రాముల బంగారం, తృతీయ బహుమతి కింద 10తులాల వెండిని అందజేశారు.ముగ్గుల పోటిలతో పాటు మహిళలకు కబడ్డి, మ్యూజిక్ చేర్ పోటిలను నిర్వహించి పోటిలలో గెలుపొందిన మహిలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటిలో ఇంద్రాజకు మొదటి ప్రైజ్, ఉమాదేవికి సెంకండ్ ప్రైజ్,మంజులకు తర్డ్ ప్రైజ్‌ను సాదించారు.అదే విధంగా కబడ్డీ పోటిలో ఇంద్రాజ టీం విజయం సాధించింది.వివిధ పోటిలలో విజయం సాధించిన మహిళలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వాణిశ్రీ, అనుషా, కిరణ్ సర్డాలు వ్యవహరించారు.ఈ కార్యకమంలో టిఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు శంకుతల,శోభరాణి, పరిమళ, డిఆర్‌సి నిర్సింలు,కౌన్సిలర్ కవి,జుబేర్‌లాల,జడ్పీటిసి రవిగౌడ్,పట్టణ పార్టి అధ్యక్షడు రావుఫ్, జగదీశ్వర్, మార్వడి యువమంచ్ నాయకులు మన్ మోహన్ సార్డా, టిఆర్‌ఎస్ నాయకులు వడ్డే శ్రీనివాస్, రాందాస్, పట్టణ టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments