Search
Friday 25 May 2018
  • :
  • :

సుప్రీం జడ్జిగా మహిళా న్యాయవాది

crt

కొలీజియం సిఫార్సు
కేంద్రం ఆమోదమే తరువాయి

న్యూఢిల్లీ : ఓ మహిళా న్యాయవాది సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చేందుకు రం గం సిద్ధమైంది. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల స్థానాలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజీయం ఇద్దరు పేర్లను ప్రతిపాదించింది. అందులో ఒకరు ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, మరొకరు మహిళా సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్ర. న్యాయమూర్తులుగా నియమించేందుకు అంగీకారం కోరుతూ సుప్రీంకోర్టుకు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి వీరిద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపితే ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు. అలాగే సుప్రీంకోర్టుకు ఎంపికైన ఏడో మహిళా న్యాయమూర్తిగా నిలుస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.భానుమతి ఉన్నారు. 1989లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ నియమితులయ్యారు. ఆమె తర్వాత జస్టిస్ సుజాత వి. మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ న్యాయమూర్తులుగా ఉన్నారు.

Comments

comments