Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పట్టుదలతో శ్రమించి ఉద్యోగాన్ని సాధించాలి

harishమన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి పట్టుదలతో శ్రమించి ఉద్యాగాన్ని సాదించినపుడే ఉచిత శిక్షణకు సార్థకత ఏర్పడుతుందని మంత్రి టీ.హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో డీసీసీ ఉచిత శిక్షణ తరగతులను పరిశీలించి మాట్లాడారు. ఎవరు అత్మవిశ్వాసాన్ని కొల్పొవద్దని మీకు అవసరమైన అన్ని సౌకర్యాలను శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి హాజరైన అభ్యర్థులు ఓపెన్ క్యాటగిరిలో ఉద్యోగాన్ని పొందాలని, మీరు మంచి ఫలితాలను సాధిస్తే భవిష్యత్తులో శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. శిక్షణ పొందుతున్న వారికి వీక్లీ పరీక్షలను నిర్వహించాలని, ఈ పరీక్షా పలితాలను భేరిజువేసుకుని తమ ప్రతిభను అభ్యర్థులు అంచనా వేసుకుని మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెసీ పద్మాకర్‌తోపాటు పలువురు హాజరైనారు.
మథ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన మంత్రి: సిద్దిపేట బాలుర, బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు మథ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా బాలికల జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతి టీఆర్‌ఎస్ సర్కారు కట్టుబడి వుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఉచితంగా అడ్మిషన్లు నిర్వహించిన ఘన సిఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నా. మంచి ఫలితాలు తేవడం మీ వంతు, సమస్యలు లేకుండా చూడటం ఇక నావంతని అన్నారు. ఇంటర్మీడియట్‌లో మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మథ్యాహ్న భోజనాన్ని దాతల సహకారంతో ప్రారంభించడం జరిగిందన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ పంపిణీ : సిద్దిపేట మునిసిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్‌ను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మునిసిపాల్టీ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా వుండాలనేదే తన ధ్యేయం అన్నారు. సిద్దిపేట మునిసిపాల్టీలో 6899 ధరఖాస్తులకుగాను 1534 ధరఖాస్తులను పూర్తి చేశామని, ప్రతి వారంలో 300 నుంచి 400 ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు పూర్తి చేయడం లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వుందని, కౌన్సిలర్లు దీనికి సహకరించాలని సూచించారు.
మంత్రి ఆకస్మిక తనఖీ : సిద్దిపేట పట్టణ శివార్లలని శ్రీరామకుంట్ల స్మృతి వనాన్ని మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్బంగా స్మృతివనంలో మొక్కలు నాటాలని చైర్మన్ రాజనర్సుకు సూచించారు. స్మశాన వాటిక ప్రహారీ గోడకు మంచి పెయింటింగ్స్‌ను వేయాలని సూచించారు.

Comments

comments