Search
Saturday 21 April 2018
  • :
  • :

సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

spkr

ఘనపురం ఆయకట్టు నుండి యాసంగి పంటకు సాగునీటి విడుదల
గత సంవత్సరం కంటే అదనంగా 20వేల ఎకరాలకు సాగునీరు
రైతులు నీటిని వృథా చేయకూడదు
డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

పాపన్నపేట/కొల్చారం : ఘనపురం ఆయకట్టు నుండి రైతు ల వ్యవసాయానికి సాగునీటిని డిప్యూటీస్వీకర్ పద్మాదేవందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డిలు సోమవారం వి డుదల చేశారు. ఆనకట్టు వద్ద ఫతేనగర్, మహబూబ్‌నగర్ కెనాల్ గేట్ల వద్ద ప్రత్యే క పూజలు నిర్వహించి నీటిని కిందకి వదిలారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ గతంలో ఘనపురం ఆయకట్టుకు జివో ప్రకారం 4 టిఎంసీల నీటి ని రైతులకు వ్యవసాయ సాగుకు వదల డం జరిగిందని, ఈ సంవత్సరం యాస ంగి పంటల సాగు కొరకు రైతులకు అదనంగా నీటిని వదల డం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులను ఆదుకుంటున్న ము ఖ్యమంత్రి కెసిఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్ర త్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఆనకట్టు కింద 21 వేల ఎకరాలు సాగవుతున్నాయని, ఈ సంవత్సరం అదనంగా మరో 20 వేల ఎకరాల సాగుకు నీరందిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గం టల నిరంతర విద్యుత్ అందించడం జ రుగుతుందని, నీటిని వృధా చేయకుం డా చివరి రైతుల పొలాలకు నీరందేవిధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కాళేశ్వర్ ప్రాజెక్టు నుండి సిం గూరు ప్రాజెక్టుకు నీటిని నింపడంతో పా టు ఘనపురం ప్రాజెక్టు ఎత్తును పెంచి మహబూబ్‌నగర్, ఫతెనగర్ కాలువ ద్వా రా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల కు సాగునీరందించేందుకు సిఎం కెసి ఆర్ ప్రత్యేక చొరువ చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మధన్‌రెడ్డి, ఇరిగేషన్ ఇఇ ఏసయ్య, మెదక్ ఆర్డీవో నగేష్, తహశీల్దార్ రాములు, ఏడుపాయల దేవస్థాన చైర్మేన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి పవిత్రదుర్గయ్య, ఎంపిటిసి సత్యనారాయణ, పాపన్నపేట, ప్రశాంత్‌రెడ్డి, దేవన్నగారి శేఖర్, వైస్ ఎంపిపి విష్ణువర్ధన్‌రెడ్డి, పొలబోయిన కిషన్, కొమ్ముల యాదాగౌడ్, చిట్యాల విజయలక్ష్మియాదయ్య, తదిత రులు ఉన్నారు.

Comments

comments