Search
Sunday 21 January 2018
  • :
  • :

విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి

worker
మన తెలంగాణ/జహీరాబాద్ ః పట్టణంలోని శ్రీకేతకి సంగమేశ్వర ఇండస్ట్రీలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అల్గర్‌స్వామి (౩౭) విద్యుత్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అల్గర్‌స్వామి తమ బంధువులు, సన్నిహితులతో కలిసి గత పది సంవత్సరాలుగా ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఉదయం కర్మాగారంలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాస్తు ఆర్తింగ్ వైరు షాక్ తగిలింది. విషయాన్ని గమనించిన తోటి కార్మికులు వెంటనే చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింనప్పటికి అల్గర్‌స్వామి మరణించినట్లు డాక్టర్లు దృవీకంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Worker killed by electric shock

Comments

comments