Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

జిల్లా అభివృద్ధికి కృషి

 

lady-collector

– బాధ్యతాయుతంగా విధుల నిర్వహణ
– జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
– జిల్లా కలెక్టర్ భారతిహోళ్ళికేరి

మనతెలంగాణ / మెదక్ ప్రతినిధి : నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించి జిల్లా  అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతిహోళ్ళికేరి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ నగేష్, డిఆర్‌వో రాములు, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, టిఎన్‌జివోలు, వ్యవసాయశాఖ అధికారులు, వైద్యాధికారులు తదితరులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్షాలను అందుకోవడంలో జిల్లాలోని అధికారులు, ఉద్యోగులందరు కృషి చేశారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ప్రదర్శించాలని, జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్షాలను అందుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్క అధికారి విధి నిర్వాహణతో పాటు కుటుంబం కోసం కూడా సమయాన్ని వెచ్చించాలన్నారు.

Comments

comments