Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన

YCP

చిత్తూరు : వైసిపి అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర ఆదివారంతో 62వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం ఉదయం నెన్నూర్ నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా సమస్యలు వింటూ, టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ కమ్మపల్లిలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ వెంట వైసిపి శ్రేణులు భారీగా తరలివెళతున్నాయి.

YCP Chief Jagan Padayatra in Chittoor

Comments

comments