Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

నీకంటూ ఒక మార్గదర్శి ఉండాలి..

Students-with-techer

మన శక్తి ఏమిటి? లోపం ఏమిటి? మన లక్షం ఏమిటి? లక్షాన్ని చేరుకోవడానికి మన శక్తి సరిపోతుందా? ఇలాంటి విషయాల పట్ల అవగాహన కలిగించడానికి , అరటిపండు ఒలిచి పెట్టినట్లు విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక మార్గదర్శి ఉండాలి. ఆ వ్యక్తి మీ కంటే వయసులో పెద్ద వ్యక్తి కావచ్చు. మీ స్నేహితుడు కావచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు కావచ్చు. ఎవరైతే తన సలహాలతో మీరు మీ లక్షాన్ని చేరుకోనేలా చేస్తారో.. వారే మీ గురువు, మార్గదర్శి.

ప్రతి విజేత వెనుక ఒక మార్గదర్శి తప్పనిసరిగా ఉంటారని మానసిక విశ్లేషకులు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో గురువును ఎంచుకొనే విషయంలో యువతరం చాలా ముందుంది. కొన్ని స్వచ్ఛందసంస్థలు గురుశిష్యుల మధ్య మరింత అవగాహన పెంచడం కోసం ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. మరి మీ మాట ఏమిటి, మీ కంటూ ఒక గురువు ఉన్నాడా , ఉంటే ఓకే … లేకపోతే ఇప్పటికే ఆలస్యమైంది. సరైన గురువును ఎంచుకునే పనిలో ఉండండి. విజయతీరాల వైపు పయనించండి.

Comments

comments