Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ఉద్యోగం రాదేమోనని..

Suside-note-with-boy

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఇది నా 8వ సూసైడ్ నోట్, ఈసారి ధైర్యం వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నా..

మన తెలంగాణ/మానకొండూర్ (కరీంనగర్ జిల్లా): ఇది నా 8వ సూసైడ్ నోట్..ప్రతి సారీ రాస్తూ ధైర్యం చాలక చించేస్తున్నా..కాని ఈ సారి నాకు ధైర్యం వచ్చింది..నా అవయవాలను దానం చేయండి.. అపుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది..నా మరణం అనంతరం కర్మకాండలు చేయవద్దు..అంటూ మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంకు చెందిన సీత శివకుమార్(22) సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివకుమార్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు. ఉద్యోగం రాదేమోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సోమవారం రాత్రి చదుకుంటానని ఇంటి సమీపంలోని మరో ఇంట్లోకి ఒంటరిగానే వెళ్లాడు. మంగళవారం తల్లి వాకిలి ఊడ్చేందుకు వెళ్లి తలుపు తీయగా శివ శవమై కన్పించాడు. మానకొండూర్ సిఐ బిల్ల కోటేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుని తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు.

Comments

comments