Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

దేశాన్ని మార్చే శక్తి యువతకే ఉంది: సంకినేని

bjp

మన తెలంగాణ/సూర్యాపేట : భారతదేశాన్ని మార్చే శక్తి యువతకే ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద 155 వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు వివేకానంద సూ క్తులు ఆదర్శమని కొనియాడారు. వివేకానందుడి ఆశయాలతో యువతరం ముందుకు సాగాలని సూచించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నల్లకుంట్ల అయోధ్య, భారతీయ జనతా మజ్దూర్ మోర్చా సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన గిలకత్తుల కరుణాకర్‌గౌడ్‌లకు సంకినేని నియామకం పత్రాలను అందజేశారు. పార్టీ పటిష్టత కోసం పాటు ప డాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కింది స్థాయి వారికి చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మార్చుకోవాలని చెప్పారు. లేని యెడల వచ్చే ఎన్నికలలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హె చ్చరించారు. నూతన పదవులకు ఎన్నికైన అయోధ్యను, కరుణాకర్‌గౌడ్‌లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొణతం సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి జీడి భిక్షం, జిల్లా నాయకులు రంగరాజు రుక్మారావు, బండపల్లి పాండురంగాచారి, పట్టణ అధ్యక్షులు అబీద్, ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు అస్లాం, వల్దాస్ ఉపేందర్, చంద్రారెడ్డి, ఏడుకొండలు, నరేందర్‌రెడ్డి, కిరణ్, క్రాంతి, సలేంద్రచారి, వీరేందర్, బిట్టు నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments