Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పఠాన్‌పై బిసిసిఐ వేటు..!

Yusuf-Pathan

ముంబయి: భారత ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్‌పై బిసిసిఐ ఐదు నెలల నిషేధం విధించింది. డోప్ టెస్టులో విఫలమైనందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. కాగా, యూసఫ్ తీసుకుంది మాత్రం దగ్గుకు సంబంధించింది మందు అని తెలుస్తోంది. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పఠాన్ గానీ, టీం డాక్టర్ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలపకుండానే వాడారు. దీంతో పఠాన్‌పై బోర్డు వేటు వేసింది. అయితే, పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బిసిసిఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు సమాచారం. కాగా, గత ఆగష్టు 15 నుంచి అతడిపై నిషేధం అమలులోకి వచ్చింది. దీంతో జనవరి 14వ తేదీతో ఆ నిషేధం గడువు ముగియనుంది. ఇది పఠాన్‌కు ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

Yusuf Pathan Suspended by BCCI After Dope Violation.

 

Comments

comments