Search
Friday 20 April 2018
  • :
  • :

నిరంతర విద్యుత్ సరఫరాపై మండల రైతుల హర్షం

statue

మన తెలంగాణ/మదనాపురం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ హన్మ న్‌రావు ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి,ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మదనాపురం మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ ఆవరణలో బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా హన్మన్‌రావు ,రైతు జిల్లా సభ్యులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నిరంతర విద్యుత్‌ను అంద జేయడం పట్ల వారు హర్షం ప్రకటిస్తుసిఎం ,ఎంఎల్‌ఎ చిత్ర పటాలకు రైతుల సమక్షంలో వారు పాలాభిషేకాలు చేశారు. సమైక్యరాష్ట్రంలోవిద్యుత్ కోతలతో ప్రజలు విసుగు చెంది తమ పొలాలను ఎండబెట్టుకున్నామన్నారు. అర్దరాత్రి నీళ్లుపొలాలకు లోఓల్టేజి సమస్యలతో విసుగు చెందారని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా సిఎం కెసిఆర్‌కే దక్కిందని వారు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు ,రైతుసమన్వయ సమితి కమిటి సభ్యులు, ఎంపిటిసి వెంకట్‌నారాయణ,సర్పంచ్ ఆవుల భాగ్యమ్మ, బాల కృష్ణ, సాయిల్‌యాదవ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, చాంద్‌పాషా,శంకర్‌యాదవ్, సత్యం యాదవ్,పాపయ్య, శ్రీనివాసులు,మనోహర్, టిఆర్‌ఎస్ నాయకులు తిరు పత య్య ,మాసన్నప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
మండల పరిధిలోని గ్రామాల్లో అజ్జకొల్లు,దుప్పల్లి ,నరసింగాపు రం,దంతనూ ర్,తిరుమలాయపల్లి,రామన్‌పాడు,కొత్తపల్లి,శంకరంపేట,గోవిందహల్లి ,నెల్విడి, లక్ష్మీపురం కాలనీ, కొన్నూర్ గ్రామాల్లో సిఎం కెసిఆర్,ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డి చిత్రపటాలకు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కృష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ ఉచిత వి ద్యుత్ అందజేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శ రాష్ట్రంగా ప్రథమ స్థానం లో ఉందన్నారు. రైతులకు కార్మికులకు నిరంతరం విద్యుత్ సరఫరాతో పని గంటలు పెరిగిందన్నారు .రైతులు ఆనందం, హర్షం ప్రకటించారు. రాములు గౌడ్, చైర్మన్ రాములు, మక్బుల్ , శ్రీనివాసులు,కృష్ణయ్య, నరసింహ్మ,సవ రన్న, అశోక్, బాల్‌రాజు, చెన్నయ్య, రాములు, శ్రీనివాసులు, చంద్రాయుడు, సూరి , రాములు,అంజి, బ్రహ్మం, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments